నర్సీపట్నం;దొంగలు వస్తున్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

5చూసినవారు
నర్సీపట్నం;దొంగలు వస్తున్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ, ఎస్ఐ రిషికేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం, గొలుగొండ మండలం కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇండియన్ బ్యాంక్‌లో ఈ నెల 5న అటెన్షన్ డైవర్షన్ ద్వారా ఒక వ్యక్తి నుంచి రూ. 50 వేల నగదు కాజేసిన ఇద్దరు మహిళా నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. తాడేపల్లి గూడెం నికి చెందిన కుంభం నాగమణి, ఎరసాని దేవి అనే పాత నేరస్తులు ఈ దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించామని, వారి నుంచి దొంగిలించిన సొత్తును రికవరీ చేసినట్లు వెల్లడించారు. ప్రజలు ఇటువంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్