Top 10 viral news 🔥

ఒకే కుటుంబంలో ముగ్గురిని గొంతు కోసి చంపి.. ఆత్మహత్య
TG: వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలో దారుణం జరిగింది. ఒకే కుటుంబంలోని ముగ్గురిని హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నాడు. వేపూరి యాదయ్య(38) అనే వ్యక్తి భార్య అలివేలు (32), కూతురు(10), వదిన హన్మమ్మ(40)ను గొంతు కోసి చంపి.. అనంతరం తానూ ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. మరో కూతురుపైన దాడి చేయగా ఆమె తప్పించుకున్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పరిగి డీఎస్పీ శ్రీనివాస్ ఘటనాస్థలికి చేరుకొని వివరాలు సేకరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




