పోలాకి మండలం డోల గ్రామానికి చెందిన ఎన్ని వీరన్న, ఈ నెల 8వ తేదీన ఎచ్చెర్లకు వెళ్తానని చెప్పి బయలుదేరి అదృశ్యమయ్యారు. మొదట కుమార్తె ఇంటికి వెళ్లి ఉంటారని భావించిన భార్య వరలక్ష్మి, బుధవారం కుమార్తెతో మాట్లాడగా వీరన్న అక్కడికి రాలేదని తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై జి. రంజిత్ తెలిపారు. వీరన్న ఆచూకీ తెలిసినవారు 8336820309, 9963535577 నంబర్లకు సంప్రదించాలని, సమాచారం అందించిన వారికి రూ. 10,000 బహుమతి ఉంటుందని తెలిపారు.