ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరిక జారీ చేసింది. ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా మీదుగా విస్తరించిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలలో ఈరోజు, రేపు, ఎల్లుండి వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.