స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కుటుంబ సభ్యుల పేర్లను అడ్డుపెట్టుకుని అక్రమ భూదందాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ స్పష్టం చేశారు. శుక్రవారం నర్సీపట్నంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో బొడ్డెపల్లి సమీపంలోని 33 సెంట్ల భూమిని దక్కించుకోవడానికి కొందరు వ్యక్తులు ఫోర్జరీ సంతకాలు, నకిలీ పత్రాలు సృష్టించారని ఆరోపించారు. ఈ అక్రమ రిజిస్ట్రేషన్ల కోసం పద్మావతి, రాజేష్, తమ కుటుంబ సభ్యుల పేర్లను వాడుతూ అధికారులను మభ్యపెట్టే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు.