Mar 24, 2026, 17:03 IST/
రాష్ట్రంలో కొత్తగా 2 లక్షల పెన్షన్ల పంపిణీ.. ఎప్పటినుంచంటే!
Mar 24, 2026, 17:03 IST
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో 2 లక్షల కొత్త పెన్షన్లు ఇవ్వడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది జూన్ 2న జరగనున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కొత్త పెన్షన్లను పంపిణీ చేయాలని సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆసరా పెన్షన్‌కు అర్హులైన కొత్త లబ్ధిదారులను గుర్తించేందుకు అధికారులు ఇప్పటికే రంగంలోకి దిగినట్లు సమాచారం. లబ్ధిదారులకు మే నెలలోనే పెన్షన్ మంజూరు పత్రాలు ఇవ్వాలని సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు.