విశాఖలో సిఐటియు ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కార్యకర్తలు పోలీసుల నిర్బంధాన్ని నిరసిస్తూ, పెండింగ్‌లో ఉన్న వేతనాలు వెంటనే పెంచాలని డిమాండ్ చేస్తూ భారీ ఆందోళన నిర్వహించారు. విజయవాడలో అంగన్‌వాడీల అరెస్టులను ఖండిస్తూ వందలాది మంది కార్యకర్తలు జీవీఎంసీ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీగా వెళ్లి, మండుటెండలో నడిరోడ్డుపై బైఠాయించారు. నాయకులు మాట్లాడుతూ, గత ఎనిమిదేళ్లుగా వేతనాలు పెంచకుండా, ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపించారు.