విశాఖలో రైల్వే జోన్ కార్యాలయాన్ని సందర్శించిన సీఎం

5చూసినవారు
విశాఖలో రైల్వే జోన్ కార్యాలయాన్ని సందర్శించిన సీఎం
విశాఖపట్నంలోని వీఎంఆర్డీఏలో ఉన్న సౌత్ కోస్టల్ రైల్వే జోన్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా రైల్వే జోన్ ప్రారంభం, రాష్ట్రంలోని కీలక రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై వారు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో మరికొన్ని కొత్త సెక్షన్లను జోన్‌లో విలీనం చేయాలని, లాజిస్టిక్స్ కనెక్టివిటీని మెరుగుపరచాలని సీఎం కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ పర్యటనలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, పలువురు శాసనసభ్యులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్