విశాఖ నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గత కొద్దిరోజులుగా భానుడి భగభగలు, ఉక్కబోతతో అల్లాడిన నగరవాసులకు శుక్రవారం వరుణుడు ఊరటనిచ్చాడు. ఉదయం నుంచే ఆకాశం మేఘావృతమై, నగరవ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు తగ్గడంతో వాతావరణం చల్లబడి నగరం ప్రశాంతంగా మారింది.