విశాఖలో ‘ఇనార్బిట్’ సందడి.. కిలోమీటర్ల మేర క్యూ కట్టిన జనం

3చూసినవారు
విశాఖ నగరంలో కొత్తగా ప్రారంభమైన ఇనార్బిట్ మాల్ పట్ల పర్యాటకులు, ముఖ్యంగా యువతలో విపరీతమైన క్రేజ్ కనిపిస్తోంది. గత జగన్ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన జరిగి, రహేజా గ్రూప్ శరవేగంగా నిర్మాణ పనులు పూర్తి చేయడంతో ఈ మాల్ అందుబాటులోకి వచ్చింది. శనివారం కావడంతో మాల్‌ను సందర్శించేందుకు నగరవాసులు భారీగా తరలివచ్చారు. లోపలికి వెళ్లేందుకు కిలోమీటర్ల మేర గంటల తరబడి క్యూ లైన్లలో వేచి చూడటం విశేషం. అత్యాధునిక సౌకర్యాలు, అంతర్జాతీయ బ్రాండ్లు ఒకే చోట లభిస్తుండటంతో విశాఖ ప్రజలకు ఇది ప్రధాన ఆకర్షణగా మారింది. అతి తక్కువ కాలంలోనే ఇంతటి భారీ ప్రాజెక్టును పూర్తి చేయడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది.

సంబంధిత పోస్ట్