రుషికొండలో అంతర్జాతీయ యోగా దినోత్సవం: యోగాంధ్రతో ఆరోగ్య సందేశం

2చూసినవారు
రుషికొండలో అంతర్జాతీయ యోగా దినోత్సవం: యోగాంధ్రతో ఆరోగ్య సందేశం
విశాఖపట్నంలోని రుషికొండ సాగరతీరంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం 'యోగాంధ్ర' కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా యంత్రాంగం, ఆయుష్ శాఖ, పర్యాటక శాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి. ఆరోగ్యానికి, శారీరక దృఢత్వానికి యోగా ఎంతో మేలు చేస్తుందని, ప్రతి ఒక్కరూ యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలని కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్జీ, జాయింట్ కలెక్టర్ విద్యాదరి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్