మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ‘బేటీ బచావో బేటీ పడావో’ పథకంలో భాగంగా విశాఖ డీఆర్‌డీఏ సమావేశ మందిరంలో జువెనైల్ జస్టిస్, పోక్సో చట్టాలపై న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి ఆర్. సన్యాసి నాయుడు పోక్సో చట్టం నిబంధనలు, బాలల కేసుల నిర్వహణపై అవగాహన కల్పించారు. సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్ ఎం. ఆర్. ఎల్. రాధ పిల్లల పునరావాసం, సంరక్షణ కమిటీల విధులను వివరించగా, జేజేబీ సభ్యులు పి. సూర్య భాస్కర్ జువెనైల్ జస్టిస్ చట్టం-2015 ముఖ్యాంశాలను తెలియజేశారు.