ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం ఆధ్వర్యంలో 'పెన్షన్ అదాలత్ - ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ మీ జిల్లాలో' అనే ప్రచార కార్యక్రమం విశాఖలో గురువారం విజయవంతంగా జరిగింది. పెన్షనర్లు, డిస్బర్సింగ్ ఆఫీసర్ల అభ్యర్థన మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అదాలత్‌కు ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఎస్. శాంతి ప్రియ హాజరై, అధికారులకు, పెన్షనర్లకు అవసరమైన దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా పెన్షన్ సంబంధిత సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమైంది.