రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖపట్నం పర్యటన నేపథ్యంలో, ఈ నెల 29న (సోమవారం) జిల్లా కలెక్టరేట్‌లో జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ తెలిపారు. రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన అధికారిక ఏర్పాట్లు, భద్రతా సమీక్షల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, ప్రజలు ఈ మార్పును గమనించాలని కోరారు.