పేపర్ ప్లేట్లు, కప్పుల వినియోగంపై ప్రజలకు అవగాహన

0చూసినవారు
విశాఖపట్నంలో సౌత్ జోన్ 33వ వార్డు, నీలం వేపచెట్టు రోడ్డు ప్రాంతంలో పర్యావరణం, ప్రజారోగ్యంపై అవగాహన కార్యక్రమం జరిగింది. శానిటరీ ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ, ఒక్కసారి వాడి పారేసే పేపర్ ప్లేట్లు, కప్పుల వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాలను వివరించారు. వీటిపై ఉండే హానికర రసాయన పూత, వేడి ఆహారంతో కలిసి శరీరంలోకి చేరి క్యాన్సర్ వంటి తీవ్ర వ్యాధులకు దారితీసే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజలు తమ ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ప్లాస్టిక్ లేదా రసాయన పూత ఉన్న వస్తువులకు బదులుగా, మళ్లీ వాడదగిన, పర్యావరణ హితమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్