శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై చింతా వరలక్ష్మి సమర్పణలో, చింతా వినీషా రెడ్డి, చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మిస్తున్న 'శ్రీ చిదంబరం గారు' చిత్రం ఫిబ్రవరి 6న విడుదల కానుంది. వినయ్ రత్నం దర్శకత్వంలో వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా విశాఖలో చిత్ర యూనిట్ ప్రత్యేక ప్రెస్ మీట్ నిర్వహించి వివరాలు వెల్లడించింది. హీరో వంశీ తుమ్మల తన మొదటి చిత్రంలో అభద్రతాభావంతో కూడిన మెల్లకన్ను యువకుడిగా నటించానని, ఇది మంచి లవ్ స్టోరీ అని తెలిపారు. హీరోయిన్ సంధ్యా వశిష్ట గోదావరి యాస నేర్చుకుని నటించానని, షూటింగ్ పాజిటివ్ వైబ్‌తో జరిగిందని పేర్కొన్నారు.