విశాఖ: కోడి పందేలు ఆడుతున్న 11 మంది అరెస్ట్

896చూసినవారు
విశాఖ: కోడి పందేలు ఆడుతున్న 11 మంది అరెస్ట్
విశాఖపట్నం ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలోని చైతన్య నగర్ ప్రాంతంలో శనివారం రాత్రి కోడి పందేలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో 11 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 4 పందెం కోళ్లు, రూ. 5,180 నగదును స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిని తదుపరి చర్యల నిమిత్తం ఎంవీపీ పోలీసులకు అప్పగించారు.

సంబంధిత పోస్ట్