పీజీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా విశాఖలో కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ సోమవారం 348 ప్రజా వినతులు స్వీకరించారు. ప్రతి సమస్యపై సంబంధిత అధికారులు ఫిర్యాదుదారులతో నేరుగా ఫోన్‌లో మాట్లాడాలని నాణ్యమైన పరిష్కారం అందించాలని ఆయన ఆదేశించారు. రెవెన్యూ, జీవీఎంసీ, పోలీస్ వంటి శాఖల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని స్పష్టం చేశారు.