విశాఖ: పారిశ్రామిక ప్రగతికి పక్కా ప్రణాళిక

3చూసినవారు
విశాఖ: పారిశ్రామిక ప్రగతికి పక్కా ప్రణాళిక
విశాఖ జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతాలలో సమగ్ర మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని జిల్లా కలెక్టర్ ఎం. ఎన్. హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా పారిశ్రామిక ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆటోనగర్, మధురవాడ ఐటీ పార్కుల్లోని కార్మికుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సు సర్వీసులు నడపాలని, ఉన్న బస్టాప్‌లను సమర్థంగా నిర్వహించాలని సూచించారు. ముఖ్యంగా గాజువాక-ఆటోనగర్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న రోడ్ ఓవర్ బ్రిడ్జి పనులను వేగవంతం చేసి, జూన్ మొదటి వారానికల్లా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆర్‌అండ్‌బి అధికారులకు స్పష్టమైన గడువు విధించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్