విశాఖ: ఏబీఎన్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలి: సీపీకి ఫిర్యాదు

4చూసినవారు
విశాఖ: ఏబీఎన్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలి: సీపీకి ఫిర్యాదు
వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కె. కె. రాజు ఆధ్వర్యంలో పార్టీ నేతలు, ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఈనెల 9న పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడాన్ని వారు ఖండించారు. రాధాకృష్ణపై వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వాసుపల్లి గణేష్ కుమార్, తిప్పల దేవన్ రెడ్డి, మొల్లి అప్పారావు, కోలా గురువులు, కటుమూరి సతీష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్