విశాఖ‌: అర‌కు ప్ర‌యాణికుల‌కు సూచ‌న‌

2చూసినవారు
విశాఖ‌: అర‌కు ప్ర‌యాణికుల‌కు సూచ‌న‌
విశాఖపట్నం: వాల్తేర్ డివిజన్ పరిధిలోని జరాటి – మనబర్ స్టేషన్ల మధ్య డబ్లింగ్ పనుల కారణంగా, ఫిబ్రవరి 3వ తేదీన కిరండూల్ ప్యాసింజర్ రైళ్ల రాకపోకల్లో రైల్వే శాఖ మార్పులు చేసింది. విశాఖపట్నం నుంచి బయలుదేరే కిరండూల్ ప్యాసింజర్ (రైలు నం. 58501) అరకు వరకే నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో కిరండూల్ – విశాఖపట్నం ప్యాసింజర్ (రైలు నం. 58502) కిరండూల్ కు బదులుగా అరకు నుంచే తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. ఈ మార్పులను గమనించి ప్రయాణికులు సహకరించాలని విశాఖ రైల్వే అధికారులు శనివారం కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్