విశాఖ‌: అల్లూరి ఆశయ సాధనకు పోరాడాలి

2చూసినవారు
విశాఖ‌: అల్లూరి ఆశయ సాధనకు పోరాడాలి
అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా విశాఖ బీచ్ రోడ్‌లో బీజేపీ ఆధ్వర్యంలో ‘అల్లూరి స్ఫూర్తి యాత్ర’ నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ కార్పొరేటర్ గంకల కవితా అప్పారావు యాదవ్, గిరిజన హక్కుల కోసం బ్రిటిష్ పాలకులను గడగడలాడించిన విప్లవ యోధుడు అల్లూరి అని కొనియాడారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధి కోసం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత పీవీఎన్ మాధవ్, పలువురు కార్యకర్తలు భారీ వాహన శ్రేణితో ర్యాలీలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you