విశాఖ: ఏపీఈపీడీసీఎల్‌ క్రీడాపోటీలు ప్రారంభం

4చూసినవారు
విశాఖ: ఏపీఈపీడీసీఎల్‌ క్రీడాపోటీలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యోగుల అంతర్ డివిజన్ క్రీడాపోటీలు విశాఖ రైల్వే మైదానంలో మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. సంస్థ సీఎండీ ఇమ్మడి పృథ్వీతేజ్ బెలూన్లు, పావురాలను ఎగురవేసి ఈ క్రీడలను ప్రారంభించారు. జిల్లాలోని వివిధ డివిజన్ల నుండి సుమారు 300 మంది ఉద్యోగులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. నిరంతరం విధుల్లో ఉండే ఉద్యోగులకు శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం కోసం క్రీడలు ఎంతో అవసరమని సీఎండీ పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్