విశాఖపట్నంలోని బాలయ్య శాస్త్రి లేఅవుట్‌లోని హిల్ వ్యూ పార్కులో ఆదివారం ఉదయం విశ్రాంత ఉద్యోగుల కోసం అత్యవసర వైద్య చికిత్సలపై అవగాహన సదస్సు జరిగింది. రిటైర్డ్ నర్సింగ్ సూపరింటెండెంట్ బి. సావిత్రి ముఖ్య అతిథిగా హాజరై, హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటి అత్యవసర పరిస్థితుల్లో 'సిపిఆర్' విధానాన్ని ఆచరణాత్మకంగా వివరించారు. గుండె జబ్బులు, మధుమేహం ఉన్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యాధుల నియంత్రణకు ప్రాణాయామం, ముద్రలు, యోగాసనాలపై శిక్షణ కూడా అందించారు.