విశాఖ: చిన్నారులతో కలసి క‌లెక్ట‌ర్ అల్పాహారం

8చూసినవారు
విశాఖ: చిన్నారులతో కలసి క‌లెక్ట‌ర్ అల్పాహారం
ప్రపంచ ఎయిడ్స్ నిర్మూలనా దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం విశాఖ జిల్లా పరిషత్‌లో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ హరేందిర ప్రసాద్ పాల్గొన్నారు. ఎయిడ్స్ వ్యాధి బారిన పడిన చిన్నారులతో కలిసి అల్పాహారం తీసుకుని, వారి చదువు, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఎయిడ్స్ పై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ జగదీశ్వర రావు, కేజీహెచ్ సూపరింటెండెంట్ డా. వాణి, జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ అధికారి డా. రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :