విశాఖ: దమ్ముంటే చర్చకు రా.. అమర్‌నాథ్‌కు మూర్తి యాదవ్ సవాల్

6చూసినవారు
విశాఖ: దమ్ముంటే చర్చకు రా.. అమర్‌నాథ్‌కు మూర్తి యాదవ్ సవాల్
జనసేన నేత పీతల మూర్తి యాదవ్, వైసీపీ హయాంలో జరిగిన విధ్వంసంపై మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ను దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. బుధవారం విశాఖలో ఆయన మాట్లాడుతూ, వైసీపీ పాలనలో పరిశ్రమలకు సమాధి రాళ్లు పడితే, కూటమి ప్రభుత్వంలో పునాది రాళ్లు పడుతున్నాయని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఐదేళ్లపాటు పోలవరాన్ని భ్రష్టు పట్టించిన వైసీపీ నేతలకు ఆ ప్రాజెక్టు గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని, పవన్ కళ్యాణ్ అభివృద్ధిపై దృష్టి పెడితే, అమర్ విమర్శలకే పరిమితమయ్యారని మండిపడ్డారు. సొంత పార్టీలోనే విలువ కోల్పోయిన అమర్ అవాకులు చవాకులు పేలడం మానుకోవాలని హితవు పలికారు.

సంబంధిత పోస్ట్