విశాఖ: స్వచ్ఛమైన ఓటర్ల జాబితాకు సహకరించండి

విశాఖలో స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన ఓటర్ల జాబితా తయారీకి రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిషోర్ కోరారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. 23 ఏళ్ల తర్వాత ఎన్నికల సంఘం మళ్లీ ఇలాంటి సమగ్ర సవరణ చేపట్టిందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యమని కలెక్టర్ తెలిపారు. ప్రతి పార్టీ బూత్ స్థాయి ప్రతినిధులను నియమించాలని, జూన్ 2లోగా వారితో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు.
