భారత వ్యయ లెక్కల నిపుణుల సంస్థ (ఐసీఎంఏఐ) 67వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం శాఖ ఆధ్వర్యంలో వ్యయ లెక్కల నిపుణుల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అవగాహన పాదయాత్ర, రక్తదాన శిబిరం, ఆర్థిక, లెక్కల రంగాల్లో ఉపాధి అవకాశాలపై మార్గదర్శక కార్యక్రమాలు చేపట్టారు. వ్యయ లెక్కల నిపుణుడి వృత్తి దేశ ఆర్థికాభివృద్ధికి కీలకమని, యువతలో ఈ రంగంపై అవగాహన పెంచేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని నిర్వాహకులు తెలిపారు.