విశాఖ: నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహం

2చూసినవారు
విశాఖ: నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహం
విశాఖ జిల్లా కలెక్టర్‌ హరేందిరప్రసాద్‌ మాట్లాడుతూ, నూతన ఆవిష్కరణలు, స్టార్టప్‌లకు ప్రభుత్వం మంచి సహకారం అందిస్తోందని తెలిపారు. మంగళవారం గీతం కళాశాలలో కేంద్ర విద్య మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇన్సిట్యూషన్స్‌ ఇన్నోవేషన్‌ కౌన్సిల్‌ ప్రాంతీయ సమావేశాన్ని ఆయన ముఖ్య అతిథిగా ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా గీతం ప్రో వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ వై. గౌతంరావు మాట్లాడుతూ గీతంలో వెంచర్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు.

ట్యాగ్స్ :