విశాఖ: కేజీహెచ్‌కు ఈసాయి ఫార్మా భారీ విరాళం

3చూసినవారు
విశాఖ: కేజీహెచ్‌కు ఈసాయి ఫార్మా భారీ విరాళం
విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ ఆస్పత్రి (కేజీహెచ్) పిల్లల శస్త్రచికిత్స విభాగానికి ఈసాయి ఫార్మాస్యూటికల్స్ రూ. 4.5 లక్షల విరాళాన్ని అందజేసింది. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు, పరికరాలు సమకూర్చేందుకు ఈ నిధులు వెచ్చించనున్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఐ. వాణి, వైద్య బృందం ఫార్మా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. చిన్నారుల సంక్షేమం కోసం తమ వంతు కృషి చేయడం గౌరవంగా భావిస్తున్నామని ఈసాయి ఫార్మా ప్రతినిధులు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్