మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను అరికట్టేందుకు 'చైతన్య స్రవంతి', 'లయన్స్ క్లబ్' సంయుక్తంగా విశాఖ జీవీఎంసీ శానిటరీ వర్కర్ల పిల్లలకు (9-14 ఏళ్లు) ఉచితంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ సోమవారం వేశాయి. ఈ సందర్భంగా చైతన్య స్రవంతి అధ్యక్షురాలు డాక్టర్ షిరీన్ రహమాన్ మాట్లాడుతూ, ఇప్పటివరకు 3000 మందికి పైగా ఆడపిల్లలకు ఈ టీకాలు అందించామని తెలిపారు. కేజీహెచ్ క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ పాండురంగకుమారి పాల్గొని, క్యాన్సర్‌ను ముందుగా గుర్తిస్తే సులభంగా నయం చేయవచ్చని సూచించారు.