ప‌ర్య‌వ‌ర‌ణంపై విశాఖ యువ‌తి వీడియో వైర‌ల్‌

3చూసినవారు
విశాఖ పరిసర ప్రాంతాలైన తర్లువాడ, సింహాచలం కొండలలో భారీగా చెట్లను నరికివేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాబోయే 1000 ఉద్యోగాల కోసం ఇంతటి ప్రకృతి విద్వంసం అవసరమా అని పర్యావరణ ప్రేమికులు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి పేరుతో పచ్చదనాన్ని నాశనం చేయడంపై అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈమేరకు ఓ యువతి చేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.