విశాఖ: సందడిగా ‘గ్రాడ్యుయేషన్ డే’ వేడుకలు

4చూసినవారు
విశాఖ: సందడిగా ‘గ్రాడ్యుయేషన్ డే’ వేడుకలు
విశాఖపట్నంలోని ఈస్ట్ కోస్ట్ రైల్వే ఉమెన్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న అనురాగ్ మాంటెస్సోరి పాఠశాలలో శనివారం గ్రాడ్యుయేషన్ డే వేడుకలు అట్టహాసంగా జరిగాయి. సంస్థ అధ్యక్షురాలు జ్యోత్స్నా బోహ్రా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డీఆర్‌ఎం లలిత్ బోహ్రా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పిల్లల సర్వతోముఖాభివృద్ధికి ఇంట్లో, పాఠశాలలో అనుకూల వాతావరణం అవసరమని, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్