ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది వేడుకలపై జరిగిన సదస్సులో వక్తలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఏయూను కేంద్ర విశ్వవిద్యాలయంగా ప్రకటించాలని, సామాజిక బాధ్యతతో కూడిన పరిశోధనలు జరగాలని మాజీ వీసీ ఆచార్య కేఎస్ చలం కోరారు. అయితే, వందేళ్ల ఘన చరిత్ర కలిగిన ఏయూ శతాబ్ది ఉత్సవాలు చాలా పేలవంగా, కొంతమందికే పరిమితమై జరగడంపై వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ విశ్వవిద్యాలయాల జోక్యం ఏయూ ప్రతిష్టను దిగజారుస్తుందని సీనియర్ జర్నలిస్టులు విమర్శించగా, అస్తిత్వ సమస్యను పరిష్కరించాలని మరికొందరు కోరారు. విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల కొరతపై కూడా చర్చ జరిగింది.