విశాఖ‌: ప్రసాదంలో నత్తపై ప్రశ్నిస్తే కేసులా?: కేకే రాజు

7చూసినవారు
సింహాచలంలో వరాహ లక్ష్మీనరసింహస్వామివారి పులిహోర ప్రసాదంలో నత్త రావడంపై నిలదీసిన భక్తులపై నాన్‌బెయిలబుల్‌ కేసులు నమోదు చేయడం దుర్మార్గమని వైకాపా విశాఖ జిల్లా అధ్యక్షుడు కె.కె. రాజు మండిపడ్డారు. ప్రసాదం అపవిత్రమైన ఘటనపై ప్రశ్నించిన వారినే తప్పుడు కేసులతో భయపెట్టడం రాష్ట్రంలోని 'రెడ్‌బుక్‌ రాజ్యాంగం' పాలనకు నిదర్శనమని ఆయన విమర్శించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాల వల్ల ఆలయాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని, భక్తులు ప్రసాదాన్ని కళ్లకు అద్దుకుని తినే పరిస్థితి పోయి, భయంతో పరిశీలించి తినాల్సిన దుస్థితి దాపురించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :