నవంబర్ 21 నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు విశాఖ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల పోస్టర్‌ను కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, ఈవో శోభారాణి, ఇతర అధికారులు ఆవిష్కరించారు. లక్షల్లో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, అందుకు తగిన ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.