విశాఖ: రాజ్యాంగ పరిరక్షణకు న్యాయవాదులు పోరాడాలి

14చూసినవారు
విశాఖ: రాజ్యాంగ పరిరక్షణకు న్యాయవాదులు పోరాడాలి
విశాఖపట్నం వైసీపీ జిల్లా లీగల్ సెల్ విస్తృత స్థాయి సమావేశం 2026 ప్రెసిడెంట్ బాజి నాయుడు అధ్యక్షతన గురువారం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలు ప్రమాదంలో పడ్డాయని, ప్రజల హక్కుల కోసం ప్రశ్నించేవారిపై అక్రమ కేసులు, అరెస్టులు పెరిగాయని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో రాజ్యాంగ పరిరక్షణకు, సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా నిలవడానికి లీగల్ సెల్ మరింత చైతన్యవంతంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. కష్టపడే ప్రతి కార్యకర్తను అధిష్టానం గుర్తిస్తుందని, 2029లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.