విశాఖలో ఫుడ్ కోర్ట్ లబ్ధిదారుల పూర్తి జాబితాను ప్రకటించిన తర్వాతే శంకుస్థాపన చేయాలని చిరు వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వారు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారంతో 8వ రోజుకు చేరుకున్నాయి. సెంట్రల్ పార్క్ ఫుడ్ ట్రక్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కే. శ్రీకాంత్ మాట్లాడుతూ, 200 మందికి దుకాణాలు నిర్మిస్తామని చెబుతున్నా, అసలైన లబ్ధిదారులు 110 మందే ఉన్నారని, మిగిలిన 90 మంది ఎక్కడి నుంచి వచ్చారో స్పష్టం చేయాలని కోరారు. జీవీఎంసీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, గతంలో తొలగించిన షాపులను తిరిగి పాత స్థానాల్లోనే కొనసాగించాలని వారు కోరుతున్నారు.