విశాఖ: కొడుకును కోడలే చంపిందంటూ తల్లిదండ్రులు ఫిర్యాదు

2చూసినవారు
విశాఖ: కొడుకును కోడలే చంపిందంటూ తల్లిదండ్రులు ఫిర్యాదు
విశాఖలో ఆదివారం రాత్రి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దొండపర్తి దగ్గర కుప్పిలి వీధిలో నివసించే కిశోర్, మౌనిక ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొంతకాలంగా వీరిద్దరి మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి. ఆదివారం రాత్రి కూడా వాగ్వాదం జరిగిన అనంతరం కిశోర్ ఉరివేసుకున్నాడు. అయితే తన కోడలే కిశోర్‌ను హతమార్చి ఆత్మహత్యగా చూపిస్తున్నారని కిశోర్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.