విశాఖ‌: యోగతో శారీరక, మానసిక వికాసం సాధ్యం

0చూసినవారు
విశాఖ‌: యోగతో శారీరక, మానసిక వికాసం సాధ్యం
పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్–2026లో భాగంగా విశాఖపట్నం జిల్లా శిక్షణా శిబిరంలో రెండో రోజు ఉదయం జరిగిన యోగా సెషన్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పాల్గొన్నారు. యోగా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబమని, ఇది శరీరానికి శక్తిని, మనసుకు ప్రశాంతతను అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్య పరిరక్షణకు, శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఏకాగ్రతను పెంపొందించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని మాధవ్ తెలిపారు. ప్రతి కార్యకర్త దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు.