విశాఖ‌: రైల్వే క్రీడ‌లు ప్రారంభం

26చూసినవారు
విశాఖ‌: రైల్వే క్రీడ‌లు ప్రారంభం
విశాఖపట్నం వాల్తేరు రైల్వే ఇండోర్ స్టేడియంలో బుధవారం 72వ పురుషుల, 11వ మహిళల అఖిల భారత రైల్వే వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్-2025-26 ప్రారంభమైంది. ఈ పోటీలు బుధవారం నుంచి 6వ తేదీ వరకు జరగనున్నాయి. డీఆర్ఎం లలిత్ బోహ్రా ఈ ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జ్యోత్స్న బోహ్రా, ఏడీఆర్‌ఎం (ఇన్ఫ్రా) ఈ. సంతారామ్, ఏడీఆర్‌ఎం (ఆపరేషన్స్) కె. రామారావు, ఇంచార్జ్-వెయిట్‌లిఫ్టింగ్ జి. వెంకట రామ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్