విశాఖ: కెకె లైన్ లేకుండా రైల్వే జోన్ అసంపూర్తి: కెకె రాజు

5చూసినవారు
విశాఖ: కెకె లైన్ లేకుండా రైల్వే జోన్ అసంపూర్తి: కెకె రాజు
కొత్తవలస-కిరండూల్ లైన్ లేకుండా విశాఖ రైల్వే జోన్ ప్రకటించడం వల్ల ఉత్తరాంధ్రకు నష్టం జరుగుతుందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కెకె రాజు విమర్శించారు. సోమవారం విశాఖలోని పార్టీ సిటీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, డిశాలో బీజేపీ బలోపేతం కోసం ఏపీకి అన్యాయం జరుగుతున్నా సీఎం చంద్రబాబు స్పందించడం లేదన్నారు. చంద్రబాబు అసమర్థ, స్వార్థపూరిత విధానాల వల్ల విశాఖతో పాటు ఉత్తరాంధ్ర తీవ్రంగా నష్టపోతోందని, కెకె లైన్, అరకు, కోరాపుట్ వంటి పర్యాటక ప్రాంతాలు లేకుండా కేంద్రం ప్రకటించిన విశాఖ రైల్వే జోన్ రాష్ట్రానికి ఉపయోగకరంగా ఉండదని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్