వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ప్రయాణీకుల రద్దీని తగ్గించేందుకు, తూర్పు కోస్తా రైల్వే కొన్ని రైళ్లకు అదనపు కోచ్‌లను తాత్కాలికంగా పెంచుతోంది. విశాఖ - కిరండూల్ ప్యాసింజర్ ఎక్స్‌ప్రెస్‌కు డిసెంబర్ 2 నుండి 28 వరకు, కిరండూల్ - విశాఖ ప్యాసింజర్ ఎక్స్‌ప్రెస్‌కు డిసెంబర్ 3 నుండి 29 వరకు ఒక 3వ ఏసీ ఎకానమీ కోచ్‌ను జోడించారు. ఈ విషయాన్ని విశాఖ రైల్వే అధికారులు సోమవారం తెలిపారు.