శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 10 మంది భక్తులు మృతి చెందడంపై విశాఖ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు కేకే రాజు శనివారం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. ఇంటెలిజెన్స్ అంచనా వేసి తగిన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కేకే రాజు డిమాండ్ చేశారు.