విశాఖ: ఉగాది పురస్కార గ్రహీతలకు ఘన సన్మానం

1చూసినవారు
విశాఖ: ఉగాది పురస్కార గ్రహీతలకు ఘన సన్మానం
విశాఖపట్నంలోని పౌర గ్రంథాలయంలో 'బాలబాట' మాసపత్రిక ఆధ్వర్యంలో మంగళవారం ప్రభుత్వ పురస్కార గ్రహీతలకు అభినందన సభ జరిగింది. ఈ కార్యక్రమంలో కళారత్న గ్రహీతలు డా. డి. వి. సూర్యారావు, సత్యవాడ రఘునాథమ్మ, సత్యవాడ సూర్యకుమారి, ఉగాది పురస్కార గ్రహీతలు మళ్ళ జ్యోతిర్మయి, గంట్ల శ్రీనుబాబులను సన్మానించారు. స్వరాజ్యం రమణమ్మ అధ్యక్షత వహించిన ఈ సభలో అల్లు వెంకట రమణ శిష్య బృందం నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. కె. ఇందిరా ప్రియదర్శిని, డా. మలయవాసిని తదితరులు పాల్గొని పురస్కార గ్రహీతలను అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్