ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ సభ్యత్వ రీన్యువల్‌కు విశాఖపట్నంలో మంచి స్పందన లభించింది. కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలోని ఏపీ ఎన్జీవో హాల్లో జరిగిన కార్యక్రమంలో మధురవాడతో సహా పలు ప్రాంతాలకు చెందిన జర్నలిస్టులు సభ్యత్వం పొందారు. ఈ సందర్భంగా నాయకులు గంట‍్ల శ్రీనుబాబు, నారాయణ్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలైన అక్రిడేషన్లు, ఇళ్ల స్థలాలు, పెన్షన్ల అంశాలను త్వరగా పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో పలువురు ఫెడరేషన్ నాయకులు పాల్గొన్నారు.