ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలోని వాల్తేర్ డివిజన్ 2025లో ఆదాయం, మౌలిక వసతుల కల్పనలో చారిత్రక విజయాలు సాధించిందని డీఆర్ఎం లిలిత్ బోహ్రా తెలిపారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, భారతీయ రైల్వేలోనే ఆదాయం, లోడింగ్‌లో 5వ స్థానాన్ని దక్కించుకున్న ఈ డివిజన్, నవంబర్ నాటికి రూ. 9,030 కోట్ల ఆదాయంతో రికార్డు సృష్టించిందని వెల్లడించారు. ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖ–సికింద్రాబాద్ వందే భారత్ కోచ్‌ల సంఖ్య పెంపు, 506 ప్రత్యేక రైళ్ల నిర్వహణ, అరకు మార్గంలో విస్తాడోమ్ కోచ్‌ల అందుబాటుతో పాటు, రూ. 1,200 కోట్ల వ్యయంతో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచినట్లు తెలిపారు.