విశాఖ: మురళీనగర్‌లో చలివేంద్రం ప్రారంభం

1చూసినవారు
విశాఖ: మురళీనగర్‌లో చలివేంద్రం ప్రారంభం
విశాఖపట్నం మురళీనగర్‌లో దివంగత కె. త్రిపురసుందరరావు స్మారకార్థం విశాఖ ట్రెక్కింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. నిర్వాహకురాలు కుప్పిలి శకుంతల నేతృత్వంలో 50 రోజుల పాటు పాదచారులు, ప్రయాణికులు, కార్మికులకు మంచినీరు, మజ్జిగను ఉచితంగా అందించనున్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా సామాన్యులకు ఉపశమనం కలిగించే ఈ కార్యక్రమం స్థానికుల ప్రశంసలు అందుకుంటోంది.