రైల్వే అభివృద్ధి, ప్రయాణికుల సౌకర్యాల విస్తరణే లక్ష్యమని రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్, అనకాపల్లి ఎంపీ డాక్టర్ సి. ఎం. రమేష్ అన్నారు. మంగళవారం విశాఖపట్నంలోని నోవోటల్ హోటల్‌లో జరిగిన ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్ పార్లమెంట్ సభ్యుల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామమోహన్ నాయుడు అధ్యక్షత వహించగా, ఈస్ట్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ పర్మేశ్వర్ ఫంక్వాల్ తదితరులు పాల్గొన్నారు.