వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికుల మహా ధర్నా

1340చూసినవారు
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు ఆదివారం కుర్మన్నపాలెం వద్ద మహా ధర్నా నిర్వహించాయి. 46 విభాగాల ప్రైవేటీకరణ ప్రతిపాదనను వెంటనే వెనక్కి తీసుకోవాలని, స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలని కార్మికులు డిమాండ్ చేశారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కార్మికులు, తక్షణ చర్యలు తీసుకోకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్